పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం*
*గాంధారిపల్లిలో 15 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ*
*ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవతోనే అర్హులకు సంక్షేమ ఫలాలు*
*సర్పంచ్ పి. సిద్దిరామ్ రెడ్డి*
వేద న్యూస్, పాపన్నపేట
పేద, నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని గాంధారిపల్లి సర్పంచ్ పి. సిద్దిరామ్ రెడ్డి పేర్కొన్నారు.
పాపన్నపేట మండల పరిధిలోని గాంధారిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను (ప్రొసీడింగ్స్) ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పి. సిద్దిరామ్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవ, ప్రజా సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధత వల్లే నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని కొనియాడారు. గతంలో సరైన నివాస సదుపాయం లేక ఇబ్బందులు పడిన పేదలకు ఈ పథకం ఒక గొప్ప వరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అర్క అశోక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, సంబంధిత ప్రభుత్వ అధికారులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
