*ఏడుపాయల క్షేత్రంలో కనులపండువగా కార్తీక దీపోత్సవం..*

*మిన్నంటిన ఆకాశ దీప కాంతులు!*

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం కార్తీక శోభతో విరాజిల్లుతోంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ) మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవం, ఆకాశ దీపోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
మంజీరా నదీ తీరాన వెలిసిన అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈ దీపోత్సవ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఈఓ మరియు అర్చక బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపోత్సవాన్ని ప్రారంభించారు.

*కనులపండువగా ఆకాశ దీపోత్సవం:*

ఉత్సవాల్లో భాగంగా ఆలయ గోపురం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభానికి ఆకాశ దీపాన్ని (ఆకాశ దీప ఘటాన్ని) శాస్త్రోక్తంగా వెలిగించి పైకి ఎగురవేశారు. లోకకల్యాణార్థం, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ ఆకాశ దీపాన్ని వెలిగించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. చీకట్లను చీల్చుకుంటూ ఆకాశంలోకి ఎగసిన దీప కాంతులను చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *