వెటర్నటి అధికారుల మొద్దు నిద్ర అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు..

వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోచికెన్ సెంటర్, మటన్ సెంటర్లను తనిఖీ చేసిన వెటర్నరీ అధికారులు లేరు. మేక,కోడి కోసే ముందు 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టి ఆరోగ్యంగా ఉంది అని సర్టిఫికెట్ జారీ చేసినప్పుడే దానినికోసి,వినియోగదారులకు ఇవ్వాలి. కానికి దీనికి విరుద్ధంగా జరుగుతుంది. వెటర్నరీ డాక్టర్ ఉన్నాడా లేక ఎక్కడికైనా వెళ్లాడా, ఉంటే సక్రమ విధులు ఎందుకు నిర్వహించడం లేదు. ఆదివారం రోజున సదరు వ్యక్తి
కోడిని తీసుకొని గుడి దగ్గర కోసుకొని వండు కుంటే ఉడకదు,తింటే ఒకటే దురద .. హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారు. పొట్టేలు మాంసం అని గొర్రెల అమ్ముతున్న మటన్ వ్యాపారస్తులు, చికెన్ మటన్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, మామూల్ల మత్తులో దిగుతున్నారని పలువురు పలుకూడాలలో చర్చించుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోనట్లయితే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు.గతంలో వీటిపైన వివరణ వెటర్నరీ డాక్టర్లను కోరితే మేము ఏమి చేయమంటారు దీనిపైన రాజకీయం చేస్తున్నారు అని సమాధానం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. గ్రామపంచాయతీ సిబ్బంది గతంలో ఫైన్ వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్న సదరు వినియోగదారులు.