- కోనరావుపేటలో పశు వైద్యశాల నిర్లక్ష్యం, ప్రజల ఆగ్రహం
వేద న్యూస్, కోనరావుపేట :
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్యశాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు సరి కాదని అంటున్నారు.
రాత్రి 10 గంటలు దాటినా ఆసుపత్రి గేటు మూసివేయకపోవడంతో పాటు, వైద్యాధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడం స్థానికులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.
పశువులకు తక్షణ సేవలు అందక, రైతులు గత 20 రోజుల నుండి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఆరోపిస్తున్నారు. రోజువారీగా కూడా సక్రమంగా విధులు నిర్వర్తించని అధికారులు రాత్రి పూట ఆసుపత్రికి తాళం కూడా వేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
పశువుల ప్రాణాలతో ఆటలాడుతున్న విధానాన్ని తక్షణం ఆపాలని, వైద్యాధికారుల అలసత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని రైతులకు, పశుపోషకులకు అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోనరావుపేట మండల ప్రజలు కోరుతున్నారు.