వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:

సిర్పూర్ టీ మండలం హుడ్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని మాకిడి గ్రామానికి చెందిన తాడే నళిని కి ఓటరు కార్డు ఉంది కానీ ఓటరు లిస్ట్ లో పేరు లేదని వాపోయారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఓటర్ లిస్టులో పేరు ఎలా తొలగించారు తనకి తెలీదని తనకి సమాచారమే లేదన్నారు.

గ్రామపంచాయతీలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ మహిళ వచ్చిందని  ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకోవడానికి తను సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తనకు ఓటరు కార్డు లేకున్న తనకి అవకాశం ఇవ్వాలని తన నామినేషన్ రిజెక్ట్ చేయకుండా చూడాలని వేడుకున్నారు.