ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ విధానం తీసుకురావాలని ఎప్పటినుండో కలలు కంటున్న సంగతి మనకు తెల్సిందే. దీనికి సంబంధించిన ప్రక్రియను అంతటా బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది.
ఈ క్రమంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలీ) ఎన్నికలు 2029లోపే వస్తాయని జాతీయ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఇప్పట్లో జమిలీ ఎన్నికలు రావు.
2029లోపే జమిలీ ఎన్నికలు వస్తాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. 2034 తర్వాతనే దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయి. రాష్ట్రపతి ఆమోదం కోసం క్షేత్రస్థాయి వర్కు చేస్తున్నమని పేర్కోన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల కోసం లక్ష కోట్లు ఖర్చు అయ్యాయి. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తే జీడీపీ 1.5% వృద్ధి చెందుతుంది.దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.4.50లక్షల కోట్లను జోడించవచ్చు అని ఆమె తెలిపారు.