Oplus_16777216

 

వేద న్యూస్, హన్మకొండ :

హన్మకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో నిర్మించిన టైగర్ ఎన్ క్లోజర్ లో, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నుండి తీసుకువచ్చిన తెల్లపులిని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం ఎంక్లోజర్ లోకి విడుదల చేశారు.

అలాగే జూలోని జంతువుల సమాచారం తెలుసుకొనుటకు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్స్, చాట్ బాట్, వన మహోత్సవం కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ జూలోని జంతువులను దత్తత తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. జూ పార్కును మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అనుజ్ అగర్వాల్, జిల్లా అటవీ శాఖాదికారి, వరంగల్ ఐ /సి హనుమకొండ, జనగాం కె.కృష్ణమాచారి, జిల్లా అటవీ శాఖాదికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజన్ , భద్రాద్రి సర్కిల్, జూ పార్క్ రేంజ్ ఆఫీసర్ బి మయూరి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది, జూపార్క్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.