వేద న్యూస్, హన్మకొండ:

కాకతీయ జులాజికల్ పార్క్ హన్మకొండ నందు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని బి.మయూరి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అధ్యక్షతన, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జీ.ఓ. సహకారంతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అనూజ్ అగర్వాల్ ఐ.ఎఫ్.ఎస్, ఇంఛార్జి జిల్లా అటవీశాఖ అధికారి, హనుమకొండ, జనగాం పాల్గొని, పులులు సంఖ్య అంతరించిపోతుందని వాటినీ సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు.

విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీలలో గెలుపొందిన, పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారరు. కార్యక్రమంలో  కె. కృష్ణమాచారి, ఎఫ్.డి.ఓ, ఫ్లయింగ్ స్క్వాడ్, భద్రాద్రి సర్కిల్ , డాక్టర్ ఆచార్య రవికుమార్ కేర్ అండ్ క్యూర్ ఫౌండర్, నార్కోటిక్స్ , పి వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా ఎల్పిజి గ్యాస్ ఫెడరేషన్ అధ్యక్షులు హనుమకొండ , ఇందారపు నాగేశ్వరరావు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంస్థాగత అధ్యక్షులు, పిట్టల రవిబాబు గారు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, జాయింట్ సెక్రటరీ, ఔల్స్ సభ్యులు సునీల్ మారపాక పాల్గొని అడవుల క్షేత్ర రక్షణ, అందులో ముఖ్యంగా పులుల ప్రాధాన్యత పై మాట్లాడారు.

“సేవ్ టైగెర్స్ – సేవ్ నేచర్” ప్రోగ్రాం లో పెద్దపులుల ఛాయాచిత్ర ప్రదర్శన గాలరి విద్యార్థులను ఎంతో ఆకర్శించింది. ఈ సందర్భంగా జూ పార్క్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

‘వేద న్యూస్’ ప్రత్యేకం.. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘పులి’