*మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.*
వేద న్యూస్, నడికూడ.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క ముఖ్యఅతిథిగా నేడు జరిగే చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభకునడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నెం మల్లారెడ్డి ఆధ్వర్యంలో నడికూడ మండలం నుండి 300 బైక్‌లతో గీసుకొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్ పైలాన్ ప్రాంతానికిప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నెం మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో నడికూడ నూతన ఎంపీడీవో కార్యాలయం, తారు రోడ్ల శంకుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ, సోషల్ మీడియా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.