వేద న్యూస్, వరంగల్ టౌన్ :

ప్రజలపై రాజ్యం చేసే ఆకృత్యాలను హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించి ఎదిరించి నిలబడ్డ ప్రజల మనిషి డాక్టర్ బుర్ర రాములు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఖిలా వరంగల్ కోట సెంటర్లో మానవ హక్కుల నేత డాక్టర్ బుర్ర రాములు 15వ యాది సభను జిల్లా హక్కుల నేతలు ప్రజాస్వామికవాదులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా జరిపారు. ముందుగా బుర్ర రాములు చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులు మరియు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం రెండు నిమిషాలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు, టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కడారి భోగేశ్వర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, బుర్ర రాములు కూతురు జన మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు పాలకుర్తి సత్యం, సాదు రాజేష్, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ తదితరులు మాట్లాడారు. డాక్టర్ బుర్ర రాములు విద్యార్థి దశ నుండే ప్రగతిశీల భావాలు కలిగి విప్లవ విద్యార్థి సంఘ నిర్మాణానికి కృషి చేశాడని అదే క్రమంలో కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్ గా పని చేస్తూ పౌర, మానవ హక్కుల సంఘాలలో రాష్ట్ర నాయకులుగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించేవాడని అన్నారు .దేశవ్యాప్తంగా వివిధ సామాజిక ఉద్యమాలపై నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన నిర్బంధాన్ని నిజ నిర్ధారణ కమిటీల ద్వారా సమాజానికి తెలిపేవాడని అన్నారు .నాటి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను బట్ట బయలు చేసేవాడని ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ల ప్రభుత్వాలు చేసిన బూటకపు ఎన్కౌంటర్లను తమ సంఘ నిజనిర్ధారణ కమిటీ ద్వారా వాస్తవ విషయాలను ప్రజలకు తెలియపరచాడన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడి చేస్తున్నద అన్నారు. భూపరాయికరణ ఆదివాసీ హక్కుల ఖననం మైనారిటీ ప్రజలపై దాడులు హత్యలు సర్వ సాధారణంగా మారిపోయాయని అన్నారు. ప్రజల హక్కుల రక్షణ కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించుటకు పని చేయడమే డాక్టర్ బుర్ర రాములు కు మనం అందించే ఘనమైన నివాళి అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ యాదవ్,వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తీగల జీవన్, న్యాయవాది మైదం జయపాల్ నలిగింటి పాల్, బెల్లంకొండ రమేష్,పూర్ణచందర్, గద్దల సంజీవ, బండి వెంకటేశ్వర్లు, భైరబోయిన ఐలయ్య, మైదంపాణి ఆర్ కృష్ణ, ప్రభాకర్ లతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *