వేద న్యూస్, వరంగల్ టౌన్ :

కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్‌పై శనివారం అర్ధరాత్రి దారుణ హత్యాయత్నం జరిగింది. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అడుప మహేశ్‌ను దుండగులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అడుప మహేశ్, ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వెంటనే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు.

అసలు ఎం జరిగింది…?

ఎన్టీఆర్ నగర్‌కు చెందిన జన్ను మధు, శనివారం రాత్రి కోటిలింగాల ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి రావాలని అడుప మహేశ్‌ను పిలిచాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మద్యం సేవించి, కుమార్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే వద్ద తన గురించి ఏమి చెప్పావని మహేశ్‌ను ప్రశ్నించాడు. సమాధానం చెప్పేలోపే మహేశ్ ఫోన్ లాక్కుని, దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతోనే ప్రాణాలు దక్కించుకోవడానికి మహేశ్ ఎన్టీఆర్ నగర్‌కు చేరుకోగా, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. తనపై హత్యాయత్నం చేసిన పత్రి కుమార్, తనకు సహకరించిన వారిని గుర్తించాలని మహేశ్ వీడియో ద్వారా పోలీసులను కోరారు. తనను, తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు. కాగా ప్రధాన నిందితుడు పత్రి కుమార్ గతంలోనే ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడి, బెయిల్‌పై బయటకు వచ్చాడని అడుప మహేశ్ తెలిపారు. రాజకీయ కక్షల వల్లే పత్రి కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *