వేదన్యూస్ తెలంగాణ

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. ఓపెన్ టెన్త్ పరీక్షలకు హాజరైన 36,863 మందిలో 26,542 మంది ఉత్తీర్ణులై 72 శాతం ఫలితాలు నమోదయ్యాయి. అలాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలకు హాజరైన 54,679 మందిలో 37,562 మంది పాస్ కాగా, ఉత్తీర్ణత శాతం 68.70గా నమోదైంది. జూన్ 4 నుంచి వెబ్ మెమోలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే రీకౌంటింగ్ కోసం జూన్ 2 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *