వేద న్యూస్, ఎల్కతుర్తి:

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు జన్మదిన వేడుకలను రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

కిషన్ రావును శాలువాతో సన్మానించారు. ఆయనకు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కిషన్ రావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్, ఉపాధ్యక్షుడు చౌల రామారావు, నడికూడ మండల అధ్యక్షుడు వంకే రాజు, సురబు బాపూరావు, బాసిని బాబురావు, మోడే మోహన్ రావు, నాగుర్ల రాజవీరు తదితరులు పాల్గొన్నారు.