వేద న్యూస్, వరంగల్ టౌన్:

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించి ఓ యువకుడు తన ఉదారతను చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల కు వెళ్లే దారిలో గురువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వానరం మృతి చెందింది. అదే సమయానికి అటుగా వెళ్తున్న శంభునిపేట ప్రాంతానికి చెందిన జడల రాము మృతి చెందిన వానరాన్ని చూసి చలించి పోయాడు. వెంటనే వానరానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అదే ప్రాంతానికి కొండయ్య, సంజీవ్ ల సహాయంతో మంగళమ్మ కుంట చెరువు ప్రాంతంలో గొయ్యి తీసి వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు చేసిన రాము ను పలువురు అభినందించారు.