- గంగాధర పట్టణ కేంద్రంలోని కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి
- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్
వేద న్యూస్, గంగాధర:
గంగాధర మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కోరింది. ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ గంగాధర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, సరిపడా తరగతి గ దులు లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు.
కళాశాల ప్రాంగణంలో చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.
వర్షాకాల నేపథ్యంలో తరగతి గదులు సరిపోక విద్యార్థులు అనేక అవస్థలు పడుతూ విద్యార్థులు కళాశాలకు వస్తున్నారని కళాశాలకు ప్రహరీ గోడను నిర్మించాలని కోరారు. మంచినీటి సౌకర్యం మూత్రశాలలో మొదలగు మౌలిక వసతులు లేమితో ప్రభుత్వ కళాశాలలు విచ్ఛిన్నమవుతున్నాయని, వెంటనే అధికారులు, ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు నాంది పలుకుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్, మండల నాయకులు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.