• తన విధులను సక్రమంగా నిర్వర్తించే వ్యక్తి: గ్రామస్తులు

వేద న్యూస్, మఠంపల్లి:

మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో ఎలక్ట్రీషియన్ పని చేసే  తాజుద్దిన్ ప్రజల అందరిలో చక్కటి పేరు కలిగి ఉన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు విద్యుత్ సమస్య లేకుండా ఉన్నది అంటే.. అది సయ్యద్ తాజుద్దిన్ కృషి అని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

ఒక పక్క మదీనా యూత్ ఉపాధ్యక్షుడుగా సేవలందిస్తూనే.. ప్రజలకు చక్కటి సేవలందిస్తున్నారు. ఓ సందర్భంలో ఆయన విద్యుత్ స్తంభంపై  పని చేస్తుండగా.. విద్యుత్ అధికారి నిర్లక్ష్యం వల్ల విద్యుత్ షాక్ తగిలి మృత్యువుతో పోరాడి గెలిచాడని స్థానికులు వెల్లడిస్తున్నారు. 

గురువారం ఆయన పుట్టిన రోజు కాగా, గ్రామస్తుల కోరిక మేరకు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. జనం దీవెనతో ఆయన పాలిటిక్స్ లోనూ సక్సెస్ అవుతారని పలువురు ఆకాంక్షిస్తున్నారు.