- పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని జగ్గారావుపల్లి గ్రామ శివారులోని వరద కాలువ పక్కన పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి చేశారు..బోయినిపల్లి ఎస్‌ఐ రాజ్ కుమార్‌కు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి జరిపారు.
ఈ దాడిలో గంగాధర మండలానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.7,200 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ రాజ్ కుమార్ వెల్లడించారు.