ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ మీటింగ్ లో మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాట్లాడుతూ.. అవసరమైతే తాను మళ్లీ రాజీనామా చేస్తానని వెల్లడించారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం, ఆ నలుగురు హామీ ఇచ్చారని ఆయన బహిరంగంగానే పేర్కొన్నారు.
komatireddy rajagopal reddy
అయితే, తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం.. సీఎంగా రేవంత్ రెడ్డి పదేండ్లు ఉంటారని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం సొంత పార్టీ ముఖ్యమంత్రిపైన ప్రభుత్వంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన వీడియో వైరలవుతోంది.
సదరు వీడియోలో మహిళ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ సార్ మీకు దండం పెడుతా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి.. మీరు రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ గెలవదు.. మునుగోడు నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ లేదు. మీకు మంత్రి పదవి ఇవ్వొద్దు అనే అనుకుంటున్నారు సర్. అందుకే దయచేసి మీరు రాజీనామా చేయండి..’’ అంటూ సదరు ఉమన్ చేసిన కామెంట్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. చూడాలి.. మరి. భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారో.. లేదో.