వేద న్యూస్, పెద్దపల్లి :
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పాముల పేట, మేడిపల్లి ఇసుక రీచ్ మూసివేత అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు అక్రమ ఇసుక రవాణా పై పత్రికా ప్రకటన విడుదల చేసిన కలెక్టర్ జిల్లాలో 11 అక్రమంగా ఇసుక డంప్ లను సీజ్ చేసి మూసివేయడం జరిగిందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం ప్రాంతంలో 5 ఇసుక డంప్ లు, మంథని ప్రాంతంలో 3 ఇసుక డంప్ లు, శ్రీరాం పూర్, రామగిరి, ధర్మారం మండలాల్లో ఒక్కో అక్రమ ఇసుక డంప్ మొత్తం 11 అక్రమ ఇసుక డంప్ లను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని అన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై సంబంధిత సెక్షన్లతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పాముల పేట మేడిపల్లి ఇసుక రీచ్ లను శాశ్వతంగా మూసి వేస్తున్నామని అన్నారు.జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్ట ప్రకారం అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కలెక్టర్ అక్రమార్కులను ఆ ప్రకటనలో హెచ్చరించారు.