వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో రాబోయే నాలుగు సంవత్సరాలకు గాను అధ్యక్ష, కార్యదర్శులను, కోశాధికారిని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ చంద్ర శేఖర్ ఆర్యా, అధ్యక్షులుగా బొలిశెట్టి కమలాకర్, ప్రధాన కార్యదర్శిగా పాకాల కృష్ణవేణి, కోశాధికారిగా అడుప సాంబశివరావు ఎన్నికయ్యారు.
వీరు రాబోయే నాలుగు సంవత్సరాలకు గాను వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ కు బాధ్యులుగా వ్యవహరిస్తారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ సభ్యులు కే.రజిత, టి.శ్రీనివాస్, ఎండి.పాషా, ఏ.జ్యోతి, మౌనిక, కడారి మహేష్, కుండే కిరణ్, బొలిశెట్టి చైతన్య, పాకాల రవీందర్ పాల్గొన్నారు.