వేద న్యూస్, చందుర్తి:

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ అవగాహన కార్యక్రమం ఎస్ఐ రమేశ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యం, డయల్‌ 100 వినియోగం, మహిళా భద్రత, సైబర్‌ భద్రతా సూచనలు, 1930 సైబర్‌ హెల్ప్‌లైన్, సంచార్ సాథి వెబ్‌పోర్టల్, సీఈఐఆర్ పోర్టల్ తదితర అంశాలను వివరించారు.

అలాగే చైల్డ్ హెల్ప్‌లైన్‌ 1098, మహిళా హెల్ప్‌లైన్‌ 181, ఫైర్ సర్వీసెస్ 101, మాదక ద్రవ్యాల ముప్పు, ట్రాఫిక్ రూల్స్‌, మోసపూరిత కాల్స్/ఓటీపీ మోసాల నివారణ, సోషల్ మీడియా జాగ్రత్తలు, సందేహాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో గ్రామస్తులు చురుకుగా పాల్గొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.