వేద న్యూస్, నల్లబెల్లి:
యూరియా స్టాక్ అయిపోవడం తో షాప్ ముందు క్యూ లైన్ లోనే ఉండి రైతులు నిరసనకు దిగారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నీ సొసైటీకి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ లో నిలుచున్నారు. మండల కేంద్రానికి 440 బస్తాలు అధికారులు కేటాయించారు. వారం రోజుల తర్వాత యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో నిల్చున్నారు.
యూరియా బస్తాలు అయిపోయిన తర్వాత ఇంకా 200 మంది రైతులు తమకు యూరియా ఇచ్చేవరకు కదిలేది లేదని తేల్చి చెప్పడంతో చేసేది ఏమి లేక అధికారులు రేపు యూరియా వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు టోకెన్లు ఇస్తామని చెప్పారు.
ఈ క్రమంలో రైతుల మధ్య స్వల్ప తోపులాట జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. స్థానిక ఎస్ఐ టోకెన్స్ రేపు ఇస్తామని చెప్పి షాప్ స్వెటర్ కిందకి లాగుతున్న క్రమంలో రైతులు తమకు టోకెన్లు ఇచ్చేవరకు కదిలేది లేదని అడ్డుకున్నారు.
టోకెన్స్ తో బయటకు వచ్చిన ఎస్ఐ ని రైతులు చుట్టుముట్టి ఉదయం నుంచి వ్యవసాయ పనులు వదిలి పెట్టుకొని ఉన్నామని ఇక్కడ ఉన్న రైతులందరికీ టోకెన్స్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక ఎస్ఐ రైతులందరినీ క్యూ లైన్ లో ఉండి టోకెన్స్ తీసుకోవాలని కోరారు. అనంతరం రైతులు టోకెన్స్ తీసుకున్నారు.