వేద న్యూస్, హన్మకొండ:
హన్మకొండలోని జ్యోతిబస్ నగర్ కాలనిలో శ్రీ గణనాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో పేర్ల వేణు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అన్నారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,హాజరై అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబస్ నగర్ ప్రజలు, యువత, వినాయక మండలి సభ్యులు పాల్గొన్నారు.