వేద న్యూస్,కొనరావుపేట:

రా జన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రాలు విద్యుత్ సౌకర్యం లేకుండానే నడుస్తున్నాయి.

గ్రామంలో ఉన్న రెండు కేంద్రాలలో కూడ ఇదే సమస్య. ఇది మౌలిక సదుపాయాల కొరతను సూచిస్తుంది. అంగన్వాడి కేంద్రాలలో విద్యుత్ లేకపోవడం వల్ల ఫ్యాన్లు లేక, ఉక్కపోత, దోమల మధ్య పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనీసం ట్యూబ్ లైట్ లేకపోవడంతో పిల్లలు చీకటి గదిలో కూర్చునే పరిస్థితి ఏర్పడింది. కావున ఇప్పటికైనా కొనరావుపేట మండల సంబంధిత అధికారులు అంగన్వాడి కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.