వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :
వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో పల్లె ప్రకృతి వనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారగా, ఈ విషయమై ‘వేద న్యూస్’ కథనాన్ని ప్రచురించింది. సదరు వార్తా కథనానికి అధికారులు స్పందించారు.
బుధవారం ఉదయం సంబంధిత ఆఫీసర్ల ఆదేశాల మేరకు పలువురు పల్లె ప్రకృతి వనం చుట్టూ కట్టుదిట్టమైన కంచె వేసి, గేట్‌కు తాళాలు వేశారు. అసాంఘిక కార్యకలాపాలు పల్లె ప్రకృతి వనంలో చేయకుండా ఎంట్రీ గేట్ క్లోజ్ చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ‘వేద న్యూస్’ తెలుగు దిన పత్రిక కు ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసమస్యలపై ‘వేద న్యూస్’ మరింత బలంగా తన గళం వినిపించాలని జనం ఆకాంక్షించారు.

