వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం అంగన్ వాడీ నూతన భవనాన్ని నిర్మించింది.

 మూడు నెలల క్రితం  భవనం ప్రారంభం కాగా, మూడు నెలలుగా సజావుగా నీటి సరఫరా ప్రాథమిక పాఠశాల బోరు నుండి తీసుకోగా, దసరా సెలవులు రావడంతో బోరు తాళాలతో పాటు మరుగుదొడ్ల తాళాలు కూడా పాఠశాల సిబ్బంది తీసుకుపోవడంతో.. అంగన్ వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అంగన్ వాడీ పిల్లలకు వంట చేసేందుకు వేరే దగ్గర నుండి నీళ్లను తీసుకువస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరుగు దొడ్ల తాళాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అంగన్వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను తీర్చాలని సిబ్బంది కోరుతున్నారు.