వేద న్యూస్, హన్మకొండ:

ఫిట్స్‌ వచ్చి అపస్మారక స్థితికి చేరిన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో హనుమకొండలోని బంధన్ ఆసుపత్రికి తరలించి హన్మకొండ పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

పద్మాక్షి గుట్ట వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీగా జన సందోహం కావడంతో సోమవారం ఓ చిన్నారికి ఫిట్స్ వచ్చి అస్వస్థతకు గురయింది.

అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై కిషోర్, కానిస్టేబుల్ రమణాకర్ స్పందించి చిన్నారిని ప్రథమ చికిత్స చేసి తమ బైక్‌పై సమీపంలోని బంధన్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.