- స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో గందరగోళం
- ఆందోళనకు దిగిన గ్రామస్తులు
వేద న్యూస్, నిర్మల్:
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లె గ్రామంలో 500 ఓట్లు ఉంటే అందులో 4 ఎస్టీ ఓట్లు, మిగతావి బీసీ ఓట్లు ఉన్నాయని ఆ ఊరి ప్రజలు వెల్లడించారు. కాగా, అసలు ఎస్సీలు లేని తమ గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ వర్గానికి ఎలా కేటాయించారని వారు సోమవారం ఆందోళనకు దిగారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజయిన నేపథ్యంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారైన క్రమంలో ఆ ఊరి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.