- గొనేల విజేందర్
వేద న్యూస్, హన్మకొండ:
బీసీలకు జీవో ద్వారా కాకుండా చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ముదిరాజ్ మెపా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గొనేల విజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామన హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడెందుకు చట్టబద్ధత కల్పించడం లేదు అని ప్రశ్నించారు.
బీసీ బిల్లు కు చట్టసభల్లో ఆమోదం తెలిపిన, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎందుకు తెచ్చారని, ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే ప్రశ్న అడుగుతుందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం అంతా బీహార్ ఎన్నికల్లో గట్టెక్కెందకు, తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామ అని అర్థం చేసుకోవచ్చను.బీసీ లకు 42 శాతం జీవో అనేది గాలిలో దీపమే అని, ఇది ఎన్ని రోజులు నిలకడగా ఉండదని, మహారాష్ట్ర పరిస్థితులే ఇక్కడ నెలకొట్టే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే పూర్తి బాధ్యత వహించి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
బీసీ సమాజం పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నారు. లేకుంటే నిరాహార దీక్షలు మరియు బీసీ ఉద్యమం అన్ని సంఘాల నుండి ఒక్కటై ఉద్యమం మొదలవుతుంది పేర్కొన్నారు.