• సైనిక్ స్కూల్ కు దారి ఇలా.. వెళ్లేది ఎలా?
  • ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు 

వేద న్యూస్, చొప్పదండి:

జిల్లాలో పేరొందిన ప్రభుత్వ పాఠశాల కు ఎవరైనా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ తమ తమ దేహాలను కుంపు చేసుకోవలసిందే… సరిగ్గా లైట్లు లేని రోడ్డు అది.. రాత్రి సమయంలో ఆ దారి వెంబడి నడక, ప్రయాణం ప్రాణ సంకటమే అని చెప్పవచ్చు..

మండలంలోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్ దారులన్నీ బురద, గుంతల మయం గా మారి అధ్వానం గా తయారు కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని కొలిమికుంట గ్రామం నుండి దాదాపు రెండు కిలోమీటర్ దూరంలో సైనిక్ స్కూల్ నిర్మాణం చేసి దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంతవరకు స్కూలుకు సంబంధించిన రహదారి గుంతలమయంతో దాని బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారని కొలిమికుంట మాజీ బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అమరగాని రాజ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

 

ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పైన చిన్న చూపు వల్లే ఈ స్కూల్ రోడ్ కి మోక్షం కలగటం లేదని ఆరోపించారు. ఇకనైనా సంబంధించిన అధికారులు, నాయకులు ఈ విషయంలో చొరవ చూపి ఈ స్కూల్ కు రోడ్ నిర్మాణం చేపట్టాలని కోరారు.

కొలిమికుంట గ్రామంలో పలు హాస్టలు కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల హాస్టల్స్ డెవలప్మెంట్, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని,  ముఖ్యంగా సైనిక్ స్కూల్ రహదారి గుంతలు ఉండడం వల్ల చాలా ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 

కరీంనగర్ రహదారి నుండి దాదాపు 2 కిలోమీటర్ సైనిక్ స్కూల్ వరకు ఇదే పరిస్థితి కనీసం రాత్రి సమయంలో రైతులు, టీచర్లు, విద్యార్థులు, పేరెంట్స్ వీధిలైట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 

రహదారి పైన వెళ్లాలాంటె స్థానికులు రహదారి మొత్తం గుంతల మయంతో, వీధి లైట్లు కూడా లేక నిత్యం ప్రజలు ప్రమాదాలకు స్థానికులు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని సంబంధింత స్థానిక ప్రజలు ముఖ్యంగా రాత్రి సమయంలో ఆ రహదారిపై వెళ్లాలంటే మొబైల్ లైట్ పట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటు వెళ్తున్నారని స్పష్టం చేశారు.

 

విషపూరితమైన క్రిమి, కీటకాలతో నిత్యం రైతులు, టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సంబంధిత నాయకులు, అధికారులు చొరవ తీసుకొని ఇక్కడి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారని రాజకుమార్ గౌడ్ అన్నారు.