వేద న్యూస్, కొండమల్లేపల్లి:
దీపావళి పండుగ రోజున నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో అత్యంత విషాదకర ఘటనచోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనఓ తల్లి.. తన ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపిన అనంతరం, తానూ ఉరివేసుకునిఆత్మహత్యకు పాల్పడింది.
ఈ దారుణ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా, జనగాల/జనకవరం గ్రామానికి చెందినకుంచాల నాగలక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7)గాపోలీసులు గుర్తించారు.
పూర్తి వివరాలు చూస్తే ఏపీకి చెందిన కుంచాల నాగలక్ష్మి, రమేష్దంపతులు నాలుగేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి వలసవచ్చి నివాసం ఉంటున్నారు.
భార్యభర్తల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలుజరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ గొడవల కారణంగానే నాగలక్ష్మి తీవ్ర ఆవేదనకు లోనై.. తనఇద్దరు పిల్లల గొంతు నులిమి హతమార్చింది.

అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకునిబలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈదారుణానికి దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కేసు నమోదుచేసుకున్న కొండమల్లేపల్లి పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానికప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పండుగ రోజున జరిగిన ఈ ఘోరం స్థానికంగా తీవ్రవిషాదఛాయలు నింపింది.