వేద న్యూస్, ఇబ్రహీంపట్నం :

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల మహోత్సవల్లో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్, ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల్ పోలీస్ కళాబృందం వారిచే ఇబ్రహీంపట్నం జూనియర్ కాలేజ్ లో విద్యార్థులకి సైబర్ క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, మరియు ఇతరత్రా అంశాల పైన జానపద రూపకంగా అవగాహన సదస్సు నిర్వహించారు.

అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 25శనివారం మెట్పల్లి సర్కిల్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇబ్రహీంపట్నం మండలంలోని యువత ఎవరైనా రక్తదానం చేయడనికి ఆసక్తి ఉంటే శనివారం మెట్టుపల్లి సర్కిల్ కార్యాలయం వద్దకి వచ్చి రక్తదానం చేయాలని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.