• శభాష్ ఎమార్వో..
  • కుండపోత వర్షంలో సహాయ చర్యలు చేపట్టిన ఎమార్వో ఇక్బాల్, సిబ్బంది
  • శభాష్ ఎమార్వో అంటూ పలువురు ప్రశంసలు

వేద న్యూస్, వరంగల్ టౌన్ :

ఖిలావరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ కుండపోత వర్షంలో బుధవారం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు.

ప్రజలకు ఏదైనా అత్యవసర అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. ప్రభుత్వం, అధికారులు ప్రజలకు అండగా ఉన్నారని భరోసా కల్పించారు.

వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ సిబ్బందికి తగిన సూచనలు అందించారు. ఈ పర్యటనలో ఆర్‌ఐ కీర్తన్, జూనియర్‌ అసిస్టెంట్లు వంశీ, శివ, జిపిఓ సుభాష్ పాల్గొని ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.