• 42%బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్

వేద న్యూస్, ఆసిఫాబాద్ :

 

బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బిసి జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక ఎన్నికల జీవో నెంబర్ 46 ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42%శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని బీసీలను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓట్లు వేసే మిషన్ లాగానే చూస్తున్నాయని అన్నారు. బీసీలను రాజకీయంగ ఎదగకుండా కుట్రలు చేస్తున్నారని ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన డి సి సి అధ్యక్షుని ఎన్నికలు నిదర్శనం అని అన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క బీసీని కూడా డిసిసి పదవిలో నియమించకపోవడంతో బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందన్నారు. రిజర్వేషన్ సాధించేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్ కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మారుతి పటేల్,నాయకులు సాయికృష్ణ, విలాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.