– గంట రవికుమార్

– పేదలకు అండగా గంట రవికుమార్ ఫౌండేషన్

వేద న్యూస్, వరంగల్ టౌన్:

జీఆర్‌కే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతుల పేద, ఉత్తమ విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌ తరగతులను శివనగర్‌లోని గోల్డెన్‌ ఓక్స్‌ స్కూల్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఫిజీషియన్‌ డా. పొన్నా దశరథం, సీనియర్‌ జర్నలిస్టు బుదారపు శ్రీనివాస్‌, ప్రముఖ న్యాయవాది నాయిని అనిల్‌ కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ వైపు ప్రజా సేవ చేస్తూనే.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గంట రవికుమార్‌కే సాధ్యమని కొనియాడారు. ఇటీవల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 528 మంది నిరుపేద విద్యార్థుల టెన్త్‌ పరీక్ష ఫీజును చెల్లించడం గంట సేవా తత్పరతకు నిదర్శనమన్నారు. అలాగే కరోనా సమయంలో ఎంతో మందికి ఆహారం, నిత్యావసర సరుకులు అందించారని గుర్తుచేశారు. వీటికితోడు ఏటా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల బాగోగులు తెలుసుకోవడమే కాకుండా వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నారని కొనియాడారు. వీటికితోడు అతితక్కువ ఫీజులతోనే సత్యం కంప్యూటర్‌లో పేద విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పన అందిస్తున్న ఘనత గంట రవికుమార్‌కే దక్కిందన్నారు. ఏటా వందలాది యువకులను మోటివేషన్‌ చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మందికి ప్రాణదాతగా గంట రవికుమార్ ఫౌండేషన్‌ నిలిచిందని కీర్తించారు.

*ప్రజా సేవతోనే ఆనందం: గంట రవికుమార్*

ప్రజా సేవ చేయడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందని సత్యం కంప్యూటర్స్‌ సంస్థల అధినేత, జీఆర్‌కే ఫౌండేషన్‌ చైర్మన్‌, బీజేపీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ పేర్కొన్నారు. మా ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. తన తల్లిదండ్రులు సూచించిన బాటలోనే నడుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి ఆహార, నిత్యావసర సరుకులు అందించామన్నారు. ఏటా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ పెద్దఎత్తున రక్తసేరణ చేయడం తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తోందన్నారు. తాను రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉన్నా సామాజిక సేవ చేయడమంటేనే ఎంతో ఇష్టమన్నారు. అవసరమైన వారికి ఎప్పటికీ తన వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శివనగర్ ప్రముఖులు మాజీ కౌన్సిలర్ కోటమ్మ, గజ్జెల లింగమూర్తి, గిరిప్రసాద్, రాంమూర్తి, వైట్ల గణేష్, గంట రవికుమార్ ఫౌండేషన్ సభ్యులు మహమ్మద్ రఫీ, కందుకూరి విజయ్ కుమార్, సామల శ్రీనివాస్ వేణు, సునీల్, సతీష్, రంజిత్, కిషోర్, సురేష్, రాజ్ కుమార్, సందీప్, నాగరాజు, రాజు, శరత్ , శ్రవణ్, భాస్కర్ మరియు స్థానికలు, విద్యార్థి, విద్యార్థినిలు పాల్గొన్నారు.