– జిల్లా సంక్షేమ అధికారి జయంతి
వేద న్యూస్, శాయంపేట:
మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ప్రాతినిధ్య వహించాలని మహిళా
సాధికారితను పెంపొందించుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి అన్నారు. శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం పి. యు మేనేజర్ గుడిమల మానస చౌదరి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి పాల్గొని మాట్లాడుతూ మహిళలు వ్యవసాయ రంగంలో కుటుంబ పోషణలో మహిళా పాత్ర గననీయమైనదనివారు కొనియాడారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ప్రాతినిధ్యం వహించాలని అన్నారు.అంతేకాకుండా మహిళలు ప్రతి కుటుంబ సంరక్షణ విషయంలో తోడ్పాటు అందిస్తూ జీవన మనుగడకు ఎంతో పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఆ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.