వేద న్యూస్, వెల్దుర్తి:
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి తండా లో జై భవాని జై సేవాలాల్ జై రామారావు మహారాజ్ గారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని గురువారం నాడు భవాని మాత బోనాలు తీయడం జరిగింది. శుక్రవారం నాడు గుడి ఆలయంలో పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భవాని మాత ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని తాండవాసులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మేము భవాని మాత మాల వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు అంత భవాని మాత గారి ఆశీస్సులు మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అమ్మవారి ఆశీస్సులతో మా కుటుంబంలో మా తాండలో అందరికీ మంచి జరగాలని మేము అందరమూ కోరుకుంటున్నాము. తండా గుడి పూజారి బానోత్ మంజ, సకేతావత్ శ్రీను మరియు తండా పెద్ద మనసులు నాయక్ సురేష్, కర్బరి హరిచంద్ మా అందరి ఆశీస్సులతో నాకు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, భవాని మాత ఆశీస్సులతో కేతవత్, దుర్గ్య నేను చర్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు రుణ పడి ఉంటానని అందరికీ అభినందించారు.