వేద న్యూస్, రుద్రూర్ :
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో శాంతియుత ఎన్నికల కోసం బోధన్ ఏసీపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పోలీసుల కవాతు నిర్వహించారు. గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా సాగేందుకు పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. ఈ కవాతులో అధికారులు పాల్గొని ఎన్నికల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ధైర్యంగా, ఎలాంటి భయం లేకుండా పాల్గొనాలని ప్రజలకు నమ్మకం కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజు, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై పి.సాయన్న, పోలీసు బలగాలు పాల్గొన్నాయి.