వేద న్యూస్, మరిపెడ:

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం 10,11వార్డులకు చెందిన బాషిపంగు శ్రీరాములు, బాషిపంగు వీరబాబు గాయపడ్డారు.ఈ  విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్  గుడిపూడి నవీన్ రావు  శనివారం వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు.

అనంతరం బాషిపంగు వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి, పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుకు మనో ధైర్యం చెప్పారు. 

 
నవీన్ రావు వెంట 11వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎడెల్లి పరశురాములు,బిఆర్ఎస్ నాయకులు ఎడెల్లి సైదులు,బాషిపంగు లక్ష్మయ్య,బాషిపంగు సురేష్,పోస్ట్ వెంకన్న, ఎడెల్లి రవి,  సోమన్న, అర్జున్, సోమయ్య,వెంకన్న, దశరదం,మల్సురు తదితరులున్నారు.