వేద న్యూస్, ఇల్లందకుంట:
తమ బాల్యస్నేహితుడి కుటుంబానికి మంగళవారం రూ.30 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇల్లందకుంట మండల పరిధిలోని బూజునూరు గ్రామానికి చెందిన పింగళి రాజిరెడ్డి మృతి చెందారు.
పింగళి రాజిరెడ్డి సతీమణి విజయ కి స్నేహితులతో కలిసి కటంగూరి రాజారెడ్డి ఆర్థిక సాయం చేశారు.
కార్యక్రమంలో రాజారెడ్డి సన్నిహితుడు మావురపు గణపతి రెడ్డి, మావురపు రాజిరెడ్డి, కటంగూరి రాజమహెందర్ రెడ్డి, కటంగూరి రాజారెడ్డి వీరాభిమాని ఎడ్ల కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..స్నేహితులకు ఇబ్బందులు వచ్చిన సమయంలో చిన్న నాటి స్నేహితులు తమవంతుగా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.