- మహబూబాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీసులో పాస్‌పోర్ట్ సేవలు
వేద న్యూస్, మరిపెడ:
పాస్‌పోర్ట్ కోసం మహబూబాబాద్ జిల్లాలోని యువత, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్రజలకు సౌకర్యవంతమైన, వేగవంతమైన పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు మహబూబాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో పాస్‌పోర్ట్ సేవలు అందించబడుతున్నాయి.
ఈ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ద్వారా కొత్త పాస్‌పోర్ట్ జారి ప్రక్రియ, పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు సంబంధించిన పత్రాల ధృవీకరణ తదితర సేవలు త్వరితగతిన అందిస్తున్నామని, డిసెంబర్ –2025 నాటికి సుమారుగా 38వేల మందికి సంబందించిన పాస్‌పోర్ట్ జారి పత్రాల ధృవీకరణ ఈ కేంద్రంలో జరిగిందని, మహబూబాబాద్, దగ్గరలో ఉన్న ఇతర జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాస్‌పోర్ట్ సేవలను సులభంగా పొందాలనివరంగల్ పోస్టల్ సూపరింటెండెంట్ బి రవి కుమార్ శుక్రవారం కోరారు.