- ఉప్పొంగిన అభిమానం.. వైఎస్ జగన్ ను కలిసిన పృథ్వీ
వేద న్యూస్, వరంగల్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ ఆశయ సాధకుడు, జగన్ వీరాభిమాని పృథ్వీ కుమార్ శనివారం భాకరాపురం నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వై ఎస్ జగన్ తో కరచాలనం చేశారు.
ఈ సందర్భంగా పృథ్వి కుమార్ మాట్లాడుతూ.. దివంగత మహానేత, సంక్షేమ రథసారథి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయసాధకుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. వై ఎస్ ఆశయ సాధన కు తాను కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు.
తన అభిమాన నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనతో కరచాలనం చేసిన సందర్భం తన జీవితంలో గుర్తుండిపోయే మధుర క్షణాలని, తన మనసు మురిసిపోతున్నదని, అభిమానము ఉప్పొంగి.. ఆనందోత్సాహాలతో ఎగిరి గంతేస్తున్నదని పృథ్వి వెల్లడించారు.