వేద న్యూస్, తుఫ్రాన్ :
కేంద్ర మంత్రి బండి సంజయ్ తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్యూ అడిషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ కార్యక్రమ స్థలాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. సందర్శకులు ఎక్కువగా హాజరయ్యే అవకాశముండటంతో ట్రాఫిక్ నియంత్రణపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అదనపు ఎస్పీ మహేందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.