వేద న్యూస్, నల్లబెల్లి :

నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ మంద సుజాత,ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సిఏలు మహిళా సంఘ నాయకురాల్లు, సభ్యులకు శాలువాలతో చిరు సత్కారం చేశారు.ఈ కార్యక్రమం మహిళల సాధికారత, సేవా దైవత్వాన్ని ప్రతిబింబించింది. మహిళలు గ్రామ సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సర్పంచ్ సుజాత రాజిరెడ్డి పేర్కొన్నారు.అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఆరోగ్య, విద్యలో అమూల్య సేవలందిస్తున్నారు.మహిళా సంఘ సభ్యులు స్వయం ఉపాధి కార్యక్రమాల్లో ముందుండి వార్డు మెంబర్లు, సిఏలు మహిళలు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఈ సత్కారం మహిళల శ్రమను గుర్తించి, ప్రోత్సహించే అవకాశంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మి, మాజీ సర్పంచ్ కవిత, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత పాల్గొన్నారు.మంద రాజిరెడ్డి ఉపసర్పంచ్ ఈర్ల నాగరాజు, గందె శ్రీనివాస్, గుప్తా కడియాల మనోహర్, గంగారపు వినయ్, ఇంగే రమేష్ తదితరులు హాజరయ్యారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *