వేద న్యూస్, నెక్కొండ :
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో మిషన్ భగీరథ వారి ఆధ్వర్యంలో”జలజీవన మిషన్” జల మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రుగొండ గ్రామ సర్పంచ్ బక్కి కవిత అశోక్ హాజరై మాట్లాడుతూ తాగునీటి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని గ్రామంలో ప్రతి ఇంటికి అందించడంతో పాటు గ్రామంలో నల్ల కనెక్షన్ లేని వారికి పైపులను వేసి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం మిషన్ భగీరథ జిల్లా ఉన్నతాధికారులను గ్రామ పాలకవర్గం వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మిషన్ భగీరథ డీఈ దేవేందర్ రెడ్డి,సయ్యద్ హాజర్, ఏఈ రాజేష్, ఎన్.వంశి, ఈఈ నిర్మల,గ్రామ ఉపసర్పంచ్ బుద్దె సంపత్, వార్డ్ సభ్యులు, బక్కి రాజశేఖర్, సుష్మిత శివ, కొమ్ముల చిన్నారి, అనూష నవీన్, గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు గోక అనిల్, కాంగ్రేస్ పార్టీ నాయకులు బక్కి కుమారస్వామి,దాసరి సంపత్,మంచాల శ్రీధర్, ఎర్ర విజేందర్, ఛిద్రబోయిన సారయ్య, ఛిద్రబోయిన రాజు,బత్తిని శ్రీధర్,మంచాల యోగేశ్వర్,సంగని ప్రకాష్,బాకీ మహేష్ బాకీ కరుణాకర్, దాసరి రమేష్ సురేందర్, బక్కి రాజేందర్ మిషన్ భగీరథ పంప్ ఆపరేటర్లు, మిగతా సిబ్బంది,గ్రామ పంచాయతీ కార్యదర్శి , మహిళా మండల సమైక్య ఏపీఎం, సీసీ, మహిళా సంఘాల వివో,ప్రతినిధులు, సీఏ లు ,తదితరులు పాల్గొన్నారు.