వేద న్యూస్, మరిపెడ :

మరిపెడ పట్టణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కోరారు. మంగళవారం ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిది, తొమ్మిదో వార్డులలో స్వచ్చత కార్యక్రమాలను మున్సిపల్ సిబ్బంది తో కలసి చేపట్టారు. మరిపెడ పట్టణ అభివృద్ధికి డోర్నకల్ ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో పట్టణాన్ని సుందరీకరించుకుందామన్నారు.

పుర ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కాలనీల పారిశుద్యంలో చొరవ చూపాలన్నారు. ఈ సందర్బంగా వార్డు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహనా కల్పించి, సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు మెరుగు రాము,జాటోతు సురేష్,గంట్ల గౌతమ్ రెడ్డి, రమేష్, నీలా లచ్చిరామ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్,మున్సిపల్ కమిషనర్ విజయానంద్,నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి, జానీ, సాయి, నాన్య,వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *