వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీమాతా అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండల గౌడ సంఘం అధ్యక్షుడు గజ్జల రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుకూరి గోవర్ధన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ సమాజానికి చెందిన ప్రజాప్రతినిధులను సన్మానించడం ఆనందదాయకమని తెలిపారు. గౌడ సమాజం ఐక్యతతో ముందుకు సాగి రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, యువత విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు, వివిధ గ్రామాల గౌడ కులస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *