వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి:

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మహిళా వైద్యు రాలు లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుద్రంగికి చెందిన గౌతమి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకురాగా.. డాక్టర్ అందుబాటులో లేరని, సిరిసిల్లకు వెళ్లాలని వైద్య సిబ్బంది సూచించడంతో బాధితులు విస్మయం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గర్భిణి పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం!

వేములవాడ ఏరియా ఆసుపత్రి సిబ్బంది గర్భిణి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. రుద్రంగి మండలానికి చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్లో వేములవాడ ఆసుపత్రికి తరలించారు.

అయితే, అక్కడ విధుల్లో ఉన్న నర్సు బాధితురాలిని పట్టించుకోకపోవడమే కాకుండా, గర్భిణిని తీసుకొచ్చిన 108 సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని సమాచారం.

ఈ విషయమై  “వేద న్యూస్” తెలుగు దినపత్రిక వేములవాడ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఇదేవిధంగా రెండు మూడు నెలల క్రితం కూడా తొమ్మిది నెలల గర్భిణీ డ్యూటీలో ఉన్న డాక్టర్ దురుసుగా ప్రవర్తించడంతో.. బాధాకరంతో ఆ గర్భిణీ ప్రైవేట్ హాస్పిటల్ లో డెలివరీ అయింది.

డబ్బు లేని పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తే ఇలా దురుసుగా ప్రవర్తించడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత డాక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *