వేద న్యూస్, కరీమాబాద్:
చల్లగా బీరు వేసి చిల్ అవుదాం అనుకున్న ఓ యువకుడికి షాక్ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఓ వైన్ షాప్ లో ఓ యువకుడు బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. బయటికి వచ్చి బీరు తాగే లోపు ఆ బాటిల్లో ఏదో తేడాగా కనిపించింది.
నిశితంగా పరిశీలించగా ఆ బీర్ బాటిల్ లో చెత్తతో పాటు పాకూరు కనిపించింది.
ఇంకేముంది ఆ యువకుడు బీర్ బాటిల్ ని అందులో కనిపించే చెత్త, పాకురును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.