వేద న్యూస్, వరంగల్ టౌన్:
తెలంగాణ డిజిటల్ మీడియా కేబుల్ న్యూస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఏ1 టీవీ మీడియా ఛానల్ కమటం వేణుగోపాల్ ని రాష్ట్ర కమిటీ అధికారకంగా నియమించారు. శుక్రవారం నుంచి రెండు సంవత్సరాల కాలం పాటు వేణుగోపాల్ పదవిలో కొనసాగుతారని తెలంగాణ డిజిటల్ కేబుల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాచర్ల గోపి ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాచర్ల గోపి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కమటం వేణుగోపాల్ కి శుభాకాంక్షలు తెలుపుతూ కేబుల్ ఛానల్ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకి అందవలసిన పథకాలు అందించే విధంగా కృషి చేయాలని కోరారు.
